మిగిలిన సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థులు రేపటిలోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా సమన్వయ అధికారి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21న నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు సాంఘిక సంక్షేమ గురుకుల వెబ్ సైట్ tswreis.inలో పరిశీలించాలని కోరారు.