ప్రత్యేక అలంకరణలో గంగాలమ్మ

W.G: నరసాపురం మండలం లింగన బోయిన చర్లలో వెలిసిన గంగాలమ్మను ఆదివారం ప్రత్యేకంగా అలంకరించారు. శ్రావణమాసం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి అమ్మవారికి సారె, నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశారు.