ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: కుసుమ్ కుమార్
TG: తనకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని.. టీపీసీసీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమ్ కుమార్ స్పష్టం చేశారు. ఆయన ఒడిశా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల కో-ఇంఛార్జ్‌గా నియమితులయ్యారు. జాతీయ రాజకీయాలపై తనకు ఆసక్తిగా ఉందని చెప్పారు. పార్టీ ఆర్గనైజేషన్ పనులు చేయడమే తనకు ఇష్టమని.. ఒడిశాతో పాటు తెలంగాణలోనూ పని చేస్తానని వెల్లడించారు.