బాపట్లలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

బాపట్లలో డ్రగ్స్‌పై అవగాహన సదస్సు

BPT: డ్రగ్స్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలపై బాపట్లలోని ఒక కళాశాలలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. అసోసియేట్ డీన్ ప్రసూన రాణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సీఐ రాంబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. డ్రగ్స్ వాడకం వల్ల విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకుంటారని, సమాజంలో కూడా చెడు పేరు వస్తుందని ఆయన హెచ్చరించారు.