నరసాపురం సెంట్రల్ కిచెన్ పనులను పరిశీలించిన ఆర్డీవో.!
KDP: కాశినాయన(M) నరసాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెంట్రల్ కిచెన్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గురువారం బద్వేల్ ఆర్డీవో చంద్రమోహన్ సెంట్రల్ కిచెన్ పనులను పరిశీలించారు. త్వరితగతిన నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. వీరి వెంట కాశినాయన మండల తహసీల్దార్ వెంకటసుబ్బయ్య, రెవెన్యూ అధికారులు, డీటి, ఆర్.ఐ, వీఆర్వో, ఎంఇవో తదితరులు ఉన్నారు.