పోలీస్ జాగిలాల గదులు ప్రారంభించిన ఎస్పీ

NRPT: పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ క్వార్టర్స్‌లోని ఖాళీ స్థలంలో నూతనంగా నిర్మించిన పోలీస్ జాగిలాల గదులను శుక్రవారం ఎస్పీ యోగేష్ గౌతమ్ ప్రారంభించారు. అనంతరం జాగిలాల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జాగిలాల గదులను పరిశీలించి, ఆవరణలో మొక్కలు నాటారు. వాటికి ప్రతి రోజు వ్యాయామం చేయిస్తూ నాణ్యమైన ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు.