VIDEO: ఆసుపత్రి నిర్మాణం కోసం నిరాహార దీక్ష
WGL: వర్ధన్నపేట పట్టణంలో 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని వర్ధన్నపేట ఆసుపత్రి సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం అంబేద్కర్ సర్కిల్ వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. స్థానికులు, సమితి సభ్యులు ఆసుపత్రి అవసరాన్ని అధికారులకు గుర్తుచేసి, తక్షణమే నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆసుపత్రిని నిర్మాణం చేపట్టాలన్నారు.