గురుద్వారలో ఘనంగా గురునానక్ జయంతి వేడుకలు
NLG: చిట్యాలలోని గురుద్వారలో శ్రీ గురు నానక్ దేవ్‌జీ జయంతి వేడుకలు ఇవాళ ఘనంగా నిర్వహించారు. శబద్ బాణీ కీర్తనలు, భజనలు చేసి సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ వేడుకల్లో ప్రముఖ సంకీర్తనాచార్యులు భాయి రవీందర్ సింగ్ బృందం, సూర్యాపేట, భువనగిరి తదితర ప్రాంతాల భక్తులు పాటు ప్రముఖ గురు ధర్మ ప్రచార పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు బహదూర్ సింగ్, సంత్ సింగ్ పాల్గొన్నారు.