మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ అరెస్ట్
VKB: కోట్‌పల్లి మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఉప్పరి మహేందర్‌ను మంగళవారం పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. పరిగి మండలం కాళ్లాపూర్, రాపోల్ గ్రామాల రైతులు చేపట్టనున్న ధర్నాకు మాజీ మంత్రి హరీశ్ రావు రానున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరిట రైతుల భూములను లాక్కోవడం సరికాదని తెలిపారు.