బాలిక అదృశ్యం.. కేసు నమోదు

బాలిక అదృశ్యం.. కేసు నమోదు

కడప: చాపాడు మండలంలోని ఓ గ్రామానికి చెందిన 15ఏళ్ల బాలిక అదృశ్యమైందని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారి వివరాల మేరకు.. సోమవారం ఇంటి నుంచి చెప్పకుండా వెళ్లిన బాలిక ఎంత సేపటికీ రాకపోవడంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితుల దగ్గర విచారించారు. ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.