కోడి పందాల స్థావరంపై దాడి.. ఆరుగురి అరెస్ట్
W.G: మహాదేవపట్నం గ్రామ శివారు బొక్కవారిపాలెంలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై ఆదివారం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై నసీరుల్లా తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 5,230 నగదు, కోడి, కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. మండల పరిధిలో జూద క్రీడలను ప్రోత్సహిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.