VIDEO : 'వరదలు తగ్గేవరకూ వంతెనపై ప్రయాణించరాదు'

ASR: ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు కొయ్యూరు మండలం రత్నంపేట, పాడి గ్రామాల మధ్యలో ఉన్న కొండవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న నేపథ్యంలో వాహనదారులు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని బుధవారం సీఐ శ్రీనివాసరావు సూచించారు. వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న సమయంలో ఎవరూ సాహసించి వాగును దాటవద్దని ప్రజలకు సూచించారు. ఈ క్రమంలో వాగు దగ్గర పోలీసు సిబ్బందిని నియమించామన్నారు.