పోలీస్ జాగిలాలతో తనిఖీలు
SKLM: శ్రీకాకుళంలోని గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, అక్రమ నిల్వలు, రవాణాను అరికట్టేందుకు ఆదివారం పోలీసు జాగిలాలతో తనిఖీలు చేపట్టారు. టూటౌన్ ఎస్ఐ రామారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్ కాంప్లెక్స్ ఆవరణలో అనుమానాస్పద ప్రదేశాలు, సమీప పార్సిల్ సర్వీసులు, దుకాణాలు, క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు తనిఖీలు చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు