'మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం'
KMR: సదాశివనగర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిద్రలేమి, ఫిట్స్, తీవ్ర ఒత్తిడి, నిరాశలతో బాధపడుతున్న మానసిక వ్యాధిగ్రస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అనంతరం అవసరం మేరకు వ్యాధిగ్రస్తులకు కౌన్సిలింగ్ అందించారు.