దాతల సహకారంతో పట్టాభిరామ ఆలయ నిర్మాణం

దాతల సహకారంతో పట్టాభిరామ ఆలయ నిర్మాణం

KRNL: కొలిమిగుండ్ల మండలం కోరుమానుపల్లె గుండం ఆంజనేయస్వామి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న పట్టాభిరామ ఆలయ నిర్మాణం దాతల సంపూర్ణ సహకారంతో పూర్తి చేస్తామని ఆలయ కమిటీ సభ్యులు, సీనియర్ నేత ఇటిక్యాల బాలిరెడ్డి వెల్లడించారు. ఈమేరకు కొలిమిగుండ్ల మండలం తిమ్మనాయినిపేట గ్రామంలో ఇంటింటికి తిరిగి రామాలయ అభివృద్ధికి సహకరించాలని ఆలయ కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.