జీవిత నా బైక్ అమ్మేసింది: రాజశేఖర్
శర్వానంద్ హీరోగా నటించిన 'బైకర్' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు రాజశేఖర్ తన బైక్ జ్ఞాపకాలను పంచుకున్నాడు. చిన్నప్పటి నుంచి బైకులంటే ప్రాణమని, 'శేషు' సినిమా కోసం కొన్న యమహా 650 బైక్‌ను షూటింగ్‌లో వాడానని తెలిపాడు. అయితే తాను చాలా వేగంగా డ్రైవ్ చేస్తున్నాననే భయంతో, తన భార్య జీవిత తనకు తెలియకుండానే ఆ బైక్‌ను అమ్మేసిందని ఆయన నవ్వుతూ గుర్తుచేసుకున్నాడు.