ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ విప్
SRCL: రంజాన్ పండుగ ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.. గురువారం రాత్రి వేములవాడ పట్టణంలో ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ.. రంజాన్ మాసం త్యాగం, సహనం, దయ, సమానత్వానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.