'కొండలపై బస్సులకు ఉచిత సదుపాయం కల్పించాలి'

AKP: తిరుపతి, విజయవాడ, అన్నవరం, సింహాచలం కొండపైకి వెళ్లే బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత సదుపాయం కల్పించాలని ఆమ్ ఆద్మీ పార్టీ అనకాపల్లి కన్వీనర్ కొణతాల హరినాధ్ బాబు కోరారు. శనివారం ఆర్డీవోను కలిసి వినతిపత్రం అందజేశారు. అయితే ఆయా ఆలయాల కొండపైకి వెళ్లే బస్సుల్లో కూడా ఉచిత సదుపాయం కల్పిస్తే మరింత మేలు చేసిన వారవుతారన్నారు.