ఆదర్శనగర్‌లో ఉచిత వైద్య శిబిరం
NRML: నిర్మల్ పట్టణంలోని 15వ వార్డు ఆదర్శనగర్ కాలనీలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కాలనీవాసులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది ప్రజల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.