VIDEO: ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ విగ్రహావిష్కరణ
కామారెడ్డి పట్టణ పరిధిలోని లింగాపూర్‌లో శివాజీ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం శివాజీ మహారాజ్ విగ్రహావిష్కరణ చేశారు. ఉత్సవ సమితి సభ్యులు మాట్లాడుతూ.. హైందవ ధర్మ రక్షణకు, ధైర్య సాహసాలకు ప్రతీకగా నిలిచిన ఛత్రపతి శివాజీ ప్రతి ఒక్కరికి ఆదర్శం అన్నారు. ఆయన జవసత్వాలను పునికిపుచ్చుకోవాలన్న సదుద్దేశంతో గ్రామంలో విగ్రహావిష్కరణ చేసినట్లు తెలిపారు.