వీడియో కాన్ఫరెన్స్‌లో రైతులు పాల్గొనాలి: హరిప్రసాద్

MDK: నార్సింగి మండలంలోని రైతు వేదికల్లో మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగే టెలి కాన్ఫరెన్స్ కార్యాక్రమానికి రైతులు హాజరు కావాలని మండల వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జ్ అధికారి హరిప్రసాద్ తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా లబ్ది పొందిన రైతులతో సీఎం రేవంత్ రెడ్డి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతారన్నారు. రైతులు సకాలంలో హాజరై తప్పకుండా వీక్షించాలని కోరారు.