'ఆటో డ్రైవర్ నుంచి మేయర్.. CPI ఘనతే'

'ఆటో డ్రైవర్ నుంచి మేయర్.. CPI ఘనతే'

BDK: ఒక సామాన్య ఆటో డ్రైవర్‌ను నేడు కార్పొరేషన్ మేయర్‌గా తీర్చిదిద్దిన ఘనత CPIకే దక్కుతుందని కొత్తగూడెం మేయర్ మూడ్ గణేష్ కొనియాడారు. ఖమ్మం గిరిప్రసాద్ భవన్‌లో జరిగిన CPI సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనకు గుర్తింపునిచ్చిన పార్టీకి ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని భావోద్వేగానికి లోనయ్యారు. కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతోనే పేదలకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.