'సేవా దృక్పథం అభినందనీయం'

NZB: మోర్తాడ్ మండలం పాలెం గ్రామంలోని ZPHS పాఠశాలకు సాయినాథ్ సుమారు రూ.30 వేల విలువ గల 65 జతల స్పోర్ట్స్ డ్రెస్సెస్ వితరణ చేశారని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలకు సహకారం అందించడం అభినందనీయమని ఉపాధ్యాయులు కొనియాడారు. చిన్న వయసులోనే సమాజ సేవా దృక్పథం ఉండడం గర్వకారణం అన్నారు. విద్యార్థుల తరఫున ఉపాధ్యాయులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.