నీటి సంపులో పడి చిన్నారి మృతి
MBNR: నీటి సంపులో పడి చిన్నారి మృతి చెందిన ఘటన నవాబ్‌పేట మండలంలో చోటుచేసుకుంది. కారుకొండకు చెందిన శ్రీను, ప్రియాంక దంపతులకు నిత్యశ్రీ, నవ్యశ్రీ ఇద్దరు కూమార్తెలు ఉన్నారు. నిన్న చిన్నారులను ఇంటి వద్దే వదిలి వారు కూలీ పనులకు వెళ్లారు. చిన్నారులు ఆడుకుంటుండగా నవ్యశ్రీ పక్కన ఇంటివారు నిర్మించిన నీటి సంపులో పడి మృతిచెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.