VIDEO: లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

VIDEO: లారీ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

GDWL: ఎర్రవల్లి మండలం విజయ పామ్ ఆయిల్ మిల్ వద్ద సోమవారం లారీ బోల్తా పడిన ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అల్యూమినియం లోడ్‌తో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్‌కు తీవ్ర గాయాలు కాగా, అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.