VIDEO: 'ఆదోని జిల్లా అవడం అవసరం'
KRNL: పశ్చిమ ప్రాంత అభివృద్ధికి, సాగు–తాగునీటికి, నిధుల పెంపునకు ఆదోని జిల్లా అవడం అవసరమని టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు ఏబు అన్నారు. ఆదివారం రాత్రి అంబేడ్కర్ విగ్రహం నుంచి రాఘవేంద్ర కూడలి వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అక్కడే ఆదోని జిల్లాగా ప్రకటించాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని ఆయన కోరారు.