15 వేల దుకాణాల్లో రోజూ రూ.50 కోట్ల విక్రయాలు

ఆసియా ఖండంలోని అతిపెద్ద రెడీమేడ్ దుస్తుల మార్కెట్ మన దేశంలోనే ఉంది. అదే ఢిల్లీలోని గాంధీనగర్ హోల్‌సేల్, రిటైల్ రెడీమేడ్ దుస్తుల మార్కెట్. శీతాకాలం, వేసవి కాలంలో ధరించే దుస్తుల కోసం ఈ బజార్‌లోని 15 వేలకు పైగా దుకాణాలకు పెద్దఎత్తున విదేశాల నుంచి ఆర్డర్లు వస్తుంటాయి. హోల్‌సేల్, రిటైల్‌లో ప్రతిరోజు రూ.50 కోట్లకుపైగా విక్రయాలు జరుగుతుంటాయి.