శాంతి ప్రణాళికపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఉక్రెయిన్, రష్యా యుద్ధం ముగించేందుకు US అధ్యక్షుడు ట్రంప్ 28 సూత్రాలతో శాంతి ప్రణాళికను రూపొందించారు. తాజాగా దీనిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది తన చివరి ప్రతిపాదన కాదని తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆ ప్రణాళికను అంగీకరించకపోతే చివరి వరకు పోరాటం కొనసాగించవచ్చని అన్నారు. తాను శాంతి మాత్రమే కోరుకుంటున్నానని, ఏదొక విధంగా ఈ యుద్ధాన్ని ముగించాలని తెలిపారు.