వాటర్ ట్యాంకు మంజూరు చేయాలని కేంద్రమంత్రి బండికి వినతిపత్రం

KNR: 21వ డివిజన్ సీతారాంపూర్‌లోని సూర్య నగర్ కాలనీలో నీటి ఎద్దడి తీర్చడానికి వాటర్ ట్యాంకు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌కు సూర్యనగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ప్రతినిధులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమృత్ పథకంలో స్మార్ట్ సిటీ కింద ఒక లక్ష లీటర్ల వాటర్ ట్యాంకు మంజూరు చేయాలని కోరినట్లు తెలిపారు.