పాడేరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం

పాడేరు జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ వద్ద రక్తదాన శిబిరం

ASR: జాతీయ సర్వేయర్ల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రెవెన్యూ సర్వేయర్‌లు శుక్రవారం పాడేరులో రక్తదాన శిబిరం నిర్వహించారు. స్థానిక జీజీహెచ్ బ్లడ్ బ్యాంక్ వద్ద రెవెన్యూ సర్వేయర్‌లు వచ్చి రక్తదానం చేశారు. రక్తదానం చేయడం ఎంతో గొప్ప విషయమని సర్వేయర్‌లు తెలిపారు. జిల్లాలోని రక్తపు నిలువలు పెంచేందుకు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశామన్నారు.