సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిది: తోటకూరి పరుశురాం

NLG: శాలిగౌరారం మండలం మాదారం గ్రామానికి చెందిన గర్రె కలమ్మకు 60 వేల రూపాయల విలువగల సీఎం సహాయ నిధి చెక్కు మంజూరు అయ్యింది. ఈ సందర్భంగా మాదారం గ్రామ శాఖ అధ్యక్షుడు తోటకూరి పరుశురాం బాధితురాలికి చెక్కును ఆదివారం అందజేశారు. సీఎం సహాయనిధి పేదలకు వరం లాంటిదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఇంధనూరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.