అన్న క్యాంటీన్‌లో భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌లో భోజనం వడ్డించిన ఎమ్మెల్యే

KDP: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో మూడు పూటలా ఉచిత భోజనం అందజేశారు. నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం, పాత బస్టాండ్ వద్ద ఉన్న క్యాంటీన్లలో ఎమ్మెల్యే మాధవి, టీడీపీ నాయకులు శ్రీనివాస, భూపేష్ పాల్గొని స్వయంగా భోజనం వడ్డించారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతోందని తెలిపారు.