ఘనంగా జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు
MNCL: మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం భారత మాజీ ప్రధాని జవహార్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక గాంధీ పార్క్‌లో జవహార్ లాల్ నెహ్రూ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ.. దేశానికి మొదటి ప్రధానిగా 14 సంవత్సరాలు ప్రజలకు ఎనలేని సేవలు అందించారని కొనియాడారు.