నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

WNP: పట్టణంలో పలు ప్రాంతాలలో శనివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. పట్టణంలోని 33/11 కెవి సబ్ స్టేషన్‌లో అదనంగా 5 MVA పవర్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు AE సుధాకర్ తెలిపారు. గృహ, వ్యాపార, పరిశ్రమల వినియోగదారులు సహకరించాల్సిందిగా ఆయన కోరారు.