అటవీ ప్రాంతంలో మరింత పచ్చదనం పెంచేలా కృషి

KMM: అటవీ ప్రాంతంలో మరింత పచ్చదనం పెంచేలా కృషి చేస్తున్నట్లు DFO సిద్దార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఎర్రుపాలెం మండలం జమలాపురం అటవీ ప్రాంతంలో 500 సీడ్ బాల్స్, విత్తనాలను నేరుగా చల్లారు. అలా చల్లిన విత్తనాలు సహజమైన వాతావరణంలో మొలకెత్తి, వృక్షాలుగా ఎదుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛంద సేవకుడు ఆదిత్య శ్రీనివాస్ ఉన్నారు.