VIDEO: నిర్మానుష్యంగా మారిన యాదగిరిగుట్ట ఆలయం
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య క్షేత్రం నిర్మానుషంగా మారింది. ఈరోజు మంగళవారం సాయంత్రం చంద్రగ్రహణం పురస్కరించుకుని ఆలయం మూసివేశారు. నిత్యం భక్తుల రద్దీతో, వేదమంత్రాలతో సందడిగా ఉండే క్షేత్రం, నేడు భక్తులు లేక ఆలయ మాడవీధులు వెలవెలబోయాయి. రేపు ఉదయం వరకు ఇదే పరిస్థితి కొనసాగనున్నది.