23 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల

23 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే తమ అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 23 మంది సభ్యులతో కూడిన జాబితాను మాజీ సీఎం పళనిసామి రిలీజ్ చేశారు. NDA కూటమిలో భాగంగా బీజేపీ 27, పీఎంకే 18, ఏఎంఎంకే 11, మిగిలిన స్థానాల్లో అన్నాడీఎంకే పోటీ చేయనుంది. కాగా ఏప్రిల్ 23న ఒకే విడతలో 234 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.