గ్రామాల్లో ఓటర్ల దినోత్సవ ర్యాలీలు

గ్రామాల్లో ఓటర్ల దినోత్సవ ర్యాలీలు

విశాఖ: మాకవరపాలెంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలోనూ అధికారులు ఓటర్లతో ర్యాలీ, మానవహారాలను నిర్వహించారు. కొండలఅగ్రహారంలో జరిగిన ర్యాలీలో తహశీల్దార్ ప్రసాద్ పాల్గొని అందరూ ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు పాల్గొన్నారు.