పారిశుధ్య కార్మికులకు స్వీట్ బాక్స్‌లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
MDCL: దీపావళి పండుగ సందర్భంగా ఈ రోజు హెచ్‌బీ కాలనీ ఫేజ్-1లో ఉప్పల్ MLA బండారి లక్ష్మారెడ్డి, హెచ్‌బీ కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్ ఆధ్వర్యంలో పారిశుధ్య కార్మికుల కోసం ప్రత్యేకంగా స్వీట్ బాక్స్‌లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పారిశుధ్య కార్మికులు మన సమాజాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు అని అన్నారు.