కరికెరలో జిల్లాలోనే తొలి 'భర్తన్ బ్యాంక్' ప్రారంభం
సత్యసాయి: జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం గుడిబండ మండలం కరికెర గ్రామంలో పర్యటించారు. గ్రామాన్ని ప్లాస్టిక్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో జిల్లాలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన 'భర్తన్ బ్యాంక్' (స్టీల్ సామాన్ల బ్యాంకు)ను ఆయన ప్రారంభించారు. కరికెర మహిళల ఐక్యత, పనితీరు జిల్లాకే ఆదర్శమని కలెక్టర్ కొనియాడారు. DRDA పీడీ నరసయ్య, DPO సమత పాల్గొన్నారు.