పోటీల వృషభం ఆకస్మిక మృతి
NDL: శిరివెళ్ల మండలం వణికెందిన్నే గ్రామంలో రాతిదూలం పోటీల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్న వృషభం ఆకస్మికంగా మృతి చెందింది. యజమాని శరభయ్య ఎలాంటి అనారోగ్యం లేకుండానే షెడ్డులో ఉన్న వృషభం చనిపోవడంతో తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గుండెపోటుతోనే వృషభం మరణించి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.