రేషన్ బియ్యం సీజ్ చేసిన పోలీసులు
HYD: కుల్సంపురలో రేషన్ బియ్యం దందా బయటపడింది. ఇళ్ల చుట్టూ తిరుగుతూ ఉదయాన్నే రేషన్ బియ్యం సేకరిస్తున్న వ్యక్తిని కుల్సంపుర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రేషన్ బియ్యంతో పాటు గోధుమలు సైతం విలువ చేసిన వ్యక్తి ధర్మతేజను పోలీసులు అరెస్ట్ చేశారు. 700 కిలోల రేషన్ బియ్యం, 900 కిలోల గోధుమలు సీజ్ చేసినట్లు తెలిపారు.