నేడు ఉచిత కంటి వైద్య శిబిరం

నేడు ఉచిత కంటి వైద్య  శిబిరం

CTR: బంగారుపాళెం స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో సోమవారం మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్, చెన్నై శంకర్ నేత్రాలయ సంయుక్తంగా ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్టు నిర్వాహకుడు మురళీకృష్ణ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం వరకు వైద్యులు రోగులకు పరీక్షలు చేసి మందులు పంపిణీ చేస్తామని తెలిపారు. అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని వెల్లడించారు.