VIDEO: రెండు కార్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

VIDEO: రెండు కార్లు ఢీ.. తప్పిన పెను ప్రమాదం

అన్నమయ్య: గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లి వద్ద శనివారం రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కడప వైపు నుంచి అతివేగంతో వస్తున్న కారు మరో కారును ఢీకొనడంతో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, కార్లలోని ఎయిర్ బెలూన్లు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.