ఎస్పీపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం
నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిలపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్పీ హిందువులపై ఆరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హిందూ పండగలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వడం లేదని.. శ్రీరామ నవమి శోభాయాత్రకు కూడా ఆంక్షలు పెట్టారన్నారు. హనుమాన్ భక్తులపై అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. ఎస్పీ తీరుపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానన్నారు.