కన్నతల్లిని రోడ్డుపై వదిలేసిన కూతుర్లు

MHBD: కన్నతల్లికి తిండి పెట్టలేక ఇద్దరు కూతుర్లు రోడ్డుపై వదిలేసి వెళ్లిన అమానవీయ ఘటన శనివారం దంతాలపల్లి మండలం గున్నెపల్లి గ్రామంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం ప్రకారం.. రామగిరి సోమక్క అనే వృద్ధురాలుకి ఇద్దరు కూతుర్లు. కాగా, గత కొంత కాలంగా తమ కూతుళ్లు ఆమెను పట్టించుకోకపోగా ఇవాళ రోడ్డుపై వదిలేసి వెళ్లగా, గుక్కెడుబువ్వ పెట్టాలని స్థానికులను వేడుకుంటోంది.