‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు’

‘విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేసే ఉద్దేశం లేదు’

AP: విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేటీకరించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. ప్రైవేట్‌పరం చేయాలనుకుంటే రూ.11400 కోట్ల ప్యాకేజీ ఎందుకు ఇస్తామని ప్రశ్నించారు. నష్టాల్లో ఉన్న కంపెనీలను కేంద్రం నడపదు కానీ ఈ విషయంలో ప్రజల సెంటిమెంట్‌ని గౌరవిస్తోందని వెల్లడించారు. కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు.