రైల్వే గేటు రెండు రోజులు మూసివేత

రైల్వే గేటు రెండు రోజులు మూసివేత

సత్యసాయి: ముదిగుబ్బలోని కదిరి రైల్వే గేటును ఈ నెల 16, 17 తేదీల్లో మూసివేస్తున్నట్లు రైల్వేశాఖ సీనియర్ సెక్షన్ ఇంజినీర్ శివంమాతూరు తెలిపారు. రైలు పట్టాల నిర్వహణ, తనిఖీ కారణంగా ఈ చర్య తీసుకున్నారు. అనంతపురం నుంచి కదిరికి వెళ్లే వాహనదారులు ముదిగుబ్బ బైపాస్‌ నుంచి, పులివెందుల నుంచి బుక్కపట్నం వైపు వెళ్లే వారు ముదిగుబ్బ పాతూరు నుంచి వెళ్లాలని సూచించారు.