పెద్దకడబూరులో ఉపాధి పనుల ప్రారంభం

పెద్దకడబూరులో ఉపాధి పనుల ప్రారంభం

KRNL: పెద్దకడబూరు గ్రామ కూలీలకు ఉపాధి కల్పించేందుకు సోమవారం ఉపాధి పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ప్రారంభించారు. గ్రామ కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ఉపాధి పనులు చేపడతామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్లికార్జున, తదితరులు పాల్గొన్నారు.