మంగళగిరిలో రోడ్లకు కొత్త రూపు

మంగళగిరిలో రోడ్లకు కొత్త రూపు

GNTR: మంగళగిరి నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి జోష్‌ వచ్చింది. మంగళగిరి - తెనాలి రోడ్‌, కంఠం రాజు కొండూరు-చిలువూరు రహదారులతో పాటు పలు గ్రామాల్లో డొంక రోడ్లు పూర్తయ్యాయి. కుంచనపల్లి-వడ్డేశ్వరం మార్గంలో పనులు వేగంగా సాగుతున్నాయి. ఇక మంగళగిరి - తెనాలి - నారాకోడూరు మధ్య నాలుగు లైన్ల రహదారికి డీపీఆర్ సిద్ధమైంది. రూ.1.12 కోట్లతో పనులు మొదలుకానున్నాయి.